Main Home

తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్వర్యంలో తొలిసారి తెలుగు జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు 2024

తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం అధ్వర్యంలో తొలిసారి తెలుగు జర్నలిస్టులకు ‘ ప్రతీ ఏటా ఉగాది పురస్కారాలు’ అందించే బృహత్తర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేసేందుకు సంతోషంగా ఉంది. సమాజాన్ని కలంతో ఎంతగానో ప్రభావితం చేసి, జర్నలిజంలో తమ నైపుణ్యం, ప్రతిభతో చెరగని ముద్ర వేసిన తెలుగు జర్నలిస్టులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వారిని గౌరవించడం, సన్మానించడం మా బాధ్యతగా భావిస్తున్నాం.

Downloard Now More Images Link Below

యూనియన్ కర్తవ్యాలు-లక్ష్యాలు

సభ్యత్వం పొందేందుకు అర్హతలు :

కావల్సిన ధ్రువపత్రాలు

సభ్యత్వం ద్వారా మీకు ఉపయోగాలు :

ఈ ఇన్సురెన్సు వలన ఉపయోగాలు

Join Now

[form id="5492"]

Support Us

Telugu Journalistula Samkshema Sangham Account Number : 1726104000117289 IFSI code : IBKL0001726 IDBI Bank, Narasaraopet Branch.

ప్రతీ ఒక్కరికీ సొంత ఇల్లు అనేది ఒక కల..ఒక భరోసా. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని జర్నలిస్టులకు కూడా సొంత ఇల్లు అనేది చిరకాలవాంఛగా మిగిలిపోయింది. ‘జర్నలిస్టులకు 3 సెంట్లు ఇళ్ళ స్థలం’ ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుని మంత్రి మండలి ఆమోదించడం, వెనువెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం శుభపరిణామం. ఇది నిజంగా.. జర్నలిస్టులకు సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి తొలిమెట్టు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జర్నలిస్టుల కుటుంబాల్లో వెలుగు నింపే గొప్ప నిర్ణయం. సగటు జర్నలిస్టుల జీవన పరిస్థితులను మెరుగుపర్చేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుంది.

స్వతహాగా జర్నలిస్టుల సమస్యలు తెలిసిన ముఖ్యమంత్రిగా జర్నలిస్టుల శ్రేయస్సు కోరుతూ.. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రశంసిస్తూ.. అందరికీ మంచి చేసే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి, మంత్రులకు రాష్ర్టంలోని జర్నలిస్టుల తరఫున ‘తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం’ నుండి ప్రత్యేక కృతజ్ఞతలు, అభినందనలు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి గారు జర్నలిస్టులకు సొంతింటి కలను సాకారం చేయడంలో ఎంతగానో కృషి చేశారు. ఆయన చేసిన మేలుతో ఈరోజు ఎంతోమంది జర్నలిస్టులు సొంతింటి కలను సాకారం చేసుకుని ధైర్యంగా జీవిస్తున్నారని చెప్పడానికి గర్వపడుతున్నాము. ప్రస్తుతం ఆయన తనయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు “జర్నలిస్టులకు 3సెంట్లు ఇంటి స్థలం ” ప్రకటించి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఈ కారణంగా “నాడు వైయస్ఆర్ గారు నేడు జగన్ గారు చరితార్థులు.”

Our Videos