ఉత్తమ జర్నలిస్టులకు ఉగాది పురస్కారాలు -2024
విభాగాలు
సామాజిక స్పృహ, బాధ్యత, భద్రత విభాగం.
ఏ విలేకరులైనా సరే ముందుగా సామాజిక స్పృహతో సమాజం పట్ల బాధ్యత వహిస్తూ... ఎవరి హక్కులైనా హరించబడుతున్నాయనే విషయం గ్రహించిన యెడల ఒక జర్నలిస్ట్ గా వారికి భద్రత కల్పించిన వారు ఈ విభాగంలో ఎంపిక కాబడతారు.
అగ్రికల్చర్ జర్నలిజం విభాగం.
అగ్రి జర్నలిజం చేసే విలేకరులు,అగ్రి జర్నలిజం లో ప్రత్యేక జర్నలిస్టులు ఈ విభాగంలోకి వస్తారు.
విద్యకు సంభవించిన జర్నలిజం.
విద్యకు సంబంధించిన ఏ కధనాలు రాసినా లేదు పత్రికల ద్వారా విద్యార్థుల కు స్టడీ మెటీరియల్ అందించే జర్నలిస్టులు, విద్యార్థులకు బోధనా అంశాలు, విద్యార్థులను తగిన సబ్జెక్ట్స్ లలో పరీక్షలకు సిద్ధం చేయడానికి సహకారం, అందుకు తగిన ఏర్పాట్లు చేయు జర్నలిస్టులు ఈ విభాగంలో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కలదు.
వైద్య విభాగం నుండి పనిచేసే కంటెంట్ రైటర్స్.
అనుభవజ్ఞులైన వైద్యులు, సమాజంలో పేదలకు ఉచిత వైద్య సలహాలు ఇచ్చే వైద్యులకు సంభవించిన విషయాలు ప్రజలకు వార్తలు/వార్తా కధనాలు రాసిన వారికి ఈ విభాగంలో దరఖాస్తు చేసుకోవచ్చు.
క్రైమ్ జర్నలిజం విభాగం.
నేర సంబంధిత వార్తలు, కథనాలు అందించిన నేపథ్యంలో ప్రమాదాలు, ఇబ్బందులు ఎదుర్కొన్న జర్నలిస్టులు ఈ విభాగంలో కి వస్తారు.
ఫోటో జర్నలిజం విభాగం.
మీడియా రంగంలో ఫోటో జర్నలిజం చాలా ప్రాముఖ్యమైనదిగా గుర్తిస్తూ... ప్రెస్ ఫోటోగ్రాఫర్ గా గుర్తింపు కలిగిన వ్యక్తులకు ప్రాముఖ్యత. ఒకవేళ ఇలా గుర్తింపు లేని ఫోటో జర్నలిస్టులు అర్జీ నమోదు చేసుకోని యెడల ప్రచురణ కాబడిన ఏ ఫోటోగ్రాఫర్ నైనా ఈ విభాగంలో ఎంపికకు అవకాశం ఉంటుంది. అయితే ఎంపిక చేసే కమిటీ నిబంధనలు వర్తిస్తాయి.
సినిమా జర్నలిజం విభాగం.
సినిమా పత్రికలు, ఆ పత్రికలకు కంటెంట్ రాసే ఫిల్మ్ జర్నలిస్టులు, కొత్త సినిమాల రివ్యూలు రాసేవారు, అందులోనూ సమాజానికి మంచి సందేశం ఇచ్చే షార్ట్ ఫిల్మ్స్ దర్శక-నిర్మాతలను ఈ విభాగంలో పరిశీలించి ఎంపిక చేయబడును. అయితే ఎంపిక విధానంలో తప్పకుండా జర్నలిస్ట్ గా ఆర్.ఎన్.ఐ గుర్తింపు కార్డు పరిశీలనకు పంపవలసిన అవసరం ఉంది. ఈ విభాగంలో ఎంపికకు ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది.
క్రీడా జర్నలిజం విభాగం.
క్రీడా రంగానికి సంబంధించిన వార్తలు, ప్రత్యేక కథనాల ద్వారా క్రీడాకారులను గుర్తించే విధంగా,ఆయా క్రీడాకారుల ను మీడియా పరంగా ప్రోత్సహిస్తూ వారికి సహకారం అందించిన జర్నలిస్టులు ఈ విభాగంలో కి వస్తారు.
స్ట్రింగర్/గ్రామీణ విలేకరి విభాగం.
ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక స్ట్రింగర్ ఉత్తమమైన పనితీరును లేదా గ్రామీణ ప్రాంతాల నుండి సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న విధానాలపై ప్రత్యేక కధనాలు రాసిన విలేకరులు ఈ విభాగంలో ఎంపికకు అర్హులు.
చిన్న పత్రికలకు ప్రోత్సాహం విభాగం.
డైలీ, వీక్లీ, పక్ష, మాస పత్రికలు ఈ నాలుగు విభాగాల పత్రికలు ఏవైనా కావచ్చు ఆర్ఎన్ఐ గుర్తింపు కలిగి ప్రజాక్షేత్రంలో సామాజిక బాధ్యత వహిస్తూ.... ప్రాచుర్యం కలిగిన తెలుగు పత్రికలు ఈ విభాగంలో నమోదు చేసుకునే అవకాశం కల్పించబడింది. ఏదైనా ఈ నాలుగు విభాగాల పత్రికల ను పరిగణలోకి తీసుకుని స్క్రీనింగ్ టెస్ట్ లో ఒక్క విభాగానికి చెందిన పత్రికను మాత్రమే ప్రకటించడం జరుగుతుంది.
సామాజిక చైతన్యం.
పలు రకాల కళలు ద్వారా ఈ సమాజాన్ని తమవంతుగా మంచి మార్గంలో నడిపించే వారిలో జర్నలిస్టులుగా గుర్తింపు కలిగిన వ్యక్తులు ఈ విభాగంలో తమ పేర్లను తగిన ఆధారాలతో ఎంపికకు నమోదు చేసుకోగలరు.
జంతుసంరక్షణ,బాలకార్మికుల నిర్మూలన.
జంతువులు మరియు బాలకార్మికుల నిర్మూలనకు ప్రత్యేక దృష్టితో వాటి రక్షణ- విముక్తి కల్పించడం వంటి అంశాలపై రాసిన/ప్రసారం కాబడిన కధనాలు ఆధారాలు జతపరుస్తూ అటువంటి జర్నలిస్టులకు ఈ విభాగంలోకి అర్జీ నమోదుకు అవకాశం.
మహిళా జర్నలిస్ట్ గా ప్రత్యేక గుర్తింపు.
ఏ విభాగానికి చెందిన వార్తలైనా కవర్ చేసే మహిళా జర్నలిస్ట్ లు ఈ విభాగంలో పేర్లు నమోదు చేసుకోవచ్చు. కనీసం ఐదు సంవత్సరాలు అనుభవంతో ప్రస్తుతం ఏ మీడియా ఫ్లాట్ ఫామ్ పై పనిచేస్తున్న మహిళా జర్నలిస్టులు ఇది గమనించి అప్లికేషన్ పంపగలరు.
అనారోగ్యంతో బతుకు భారమైన జర్నలిస్ట్.
అనారోగ్యంతో ఇప్పటికీ జర్నలిజంలో కొనసాగు తూ... జర్నలిజంలో బతకలేక మరే పని చేయలేక ఇబ్బందులు ఎదుర్కొం టున్న జర్నలిస్ట్ లు ఆధారాలు జతపరచండి.
సీనియర్ వీడియో జర్నలిస్ట్.
5ఏళ్ళు పైబడిన వీడియో జర్నలిస్టులు ఈ విభాగంలోకి రావడం జరుగుతుంది. వీడియో జర్నలిస్టుగా ఐ.డీ,కార్డు తప్పనిసరి. ప్రధానమైన వార్తలు/వార్తా కధనాలు షూట్ చేసిన ఆధారాలను పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
తెలుగు న్యూస్ వెబ్ సైట్.
గతంలో మీడియా లో పనిచేసి ప్రస్తుతం సొంతంగా తెలుగు న్యూస్ వెబ్ సైట్ నిర్వహిస్తూ కనీసం ఇద్దరు కంటెంట్ రైటర్స్ కి ఉపాధి కల్పిసున్న వారు ఈ విభాగంలోకి వస్తారు.
యూ ట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న సీనియర్ జర్నలిస్ట్.
గతంలో సీనియర్ జర్నలిస్టులుగా విధులు నిర్వహించి ప్రస్తుతం సొంతంగా న్యూస్ కంటెంట్ తో యూ ట్యూబ్ ఛానల్ నిర్వహించేవారు ఈ విభాగానికి వస్తారు.
మానవీయ కోణంలో మంచి కధనం చేసిన జర్నలిస్ట్.
సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా కావచ్చు పాఠకులు/వీక్షకుల మనసులను తట్టి ఆలోచింపజేసే కథనాలను రూపొందించిన జర్నలిస్టు లు ఈ విభాగంలోకి వస్తారు.
జర్నలిజంలో బహుముఖ ప్రజ్ఞాశాలి.
జర్నలిజంలో కొనసాగుతూ....ఒక జర్నలిస్ట్ గా,కవి,రచయిత, ఎనలిస్ట్ ఇలా జర్నలిజం రంగంలో ఎన్ని అర్హతలు ఉంటే అన్ని అర్హతలు ఒకే జర్నలిస్టులోనే ఉంటాయో అటువంటి జర్నలిస్టులు ఈ కేటగిరీలో అప్లికేషన్ నమోదుకు అవకాశం ఉంది.అయితే ఈ కేటగిరీలో ఎవరికి ఎన్నిఅర్హతలు ఉండి బహుముఖ ప్రజ్ఞాశాలి విభాగంలో అప్లికేషన్ పెట్టినా నిబంధనలకు అనుగుణంగా స్క్రీనింగ్ టెస్ట్ లో ఒక్కరిని మాత్రమే ఎంపిక చేయడం జరుగుతుంది.
ఎడిటోరియల్ విభాగం.
ప్రింట్ మీడియాలో ఏ పేపర్,మ్యాగజైన్ అయినా కావచ్చు ఆర్.ఎన్.ఐ, గుర్తింపు కలిగిన పత్రికలలో ప్రచురణ కాబడిన సంపాదకీయ రచనలు, ఎడిట్ పేజీ రచనలు,బై లైన్ ఆధారంగా ఈ విభాగంలో ఎంపిక చేయబడును.
ప్రజాక్షేత్రంలో ప్రజల ఆదరణ పొందుతున్న పత్రిక.
నేటి సమాజంలో పత్రికారంగం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. పెద్ద పత్రికలతో పోటీ పడుతూ ప్రజలకు బాగా దగ్గరవుతున్న, ప్రజల ఆదరణ చూరగొంటున్న పత్రికను ఎంపిక కమిటీ నిబంధనలకు అనుగుణం గా ఎంపిక చేయబడుతుం ది.ఈ విభాగంలో అప్లికేషన్ చేయువారు ముఖ్యంగా గమనించాలి.ఆర్.ఎన్. ఐ,ఆడిట్ బ్యూరో సర్క్యులేషన్,పబ్లికేషన్స్ వంటివి అన్నీ పరిగణలోకి వస్తాయి.
పరిశోధనాత్మక పాత్రికేయులు.
సమాజంలో జరుగుతున్న ఏ వ్యవహారాలనైనా ఎవరో దాయాలని, అణిచివేయాలని, వెలుగులోకి రానీయకుండా ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తూ వ్యవస్థలను, వ్యక్తులను వాడుకునే విధానాల వంటివి వెలికి తీయడమే పరిశోధనాత్మక జర్నలిజం. ఇలాంటి జర్నలిజం చేసేవారు ఈ విభాగంలో అప్లికేషన్ చేసుకోవడానికి అర్హులు.
వెటరన్ జర్నలిస్ట్.
జర్నలిజంలో అపారమైన అనుభవం కలిగినవారు, జర్నలిజం-జర్నలిస్టులపై అనుభవం సాధించినవారు ఈ విభాగంలో ఎంపిక చేయడం జరుగుతుంది.
న్యూస్ రీడర్
కేబుల్ నెట్ వర్క్స్ లో నడుస్తున్న న్యూస్ చానల్స్ కి చెందిన న్యూస్ రీడర్ పురుషులు/మహిళల్లో ఎవరైనా ఒక్కరిని మాత్రమే ఈ కేటగిరీలో ఎంపిక చేయబడును.న్యూస్ చదివే విధానం కాకుండా న్యూస్ చెప్పే విధంగా ఉన్న వారికి ప్రాధాన్యతగా ఎంపిక విధానం ఉంటుంది.
ట్రావెల్ జర్నలిజం.
మారుతున్న కాలానికి అనుగుణంగా జర్నలిజంలో కూడా మార్పులు వస్తున్నాయి. ఇందులో కొంతమంది ఎంచుకున్న ప్రయాణ మార్గాలలో ఉన్న ప్రత్యేకతలు, కొత్త కొత్త ప్రాంతాలు,చారిత్రక కట్టడాలు వంటి వాటి గురించి సోషల్ మీడియా వేదికగా పనిచేస్తున్న వ్యక్తులు ఈ విభాగంలో ఆధారాలను జతపరుస్తూ పేర్లు నమోదు చేసుకోగలరు. అయితే మీడియా పరంగా గుర్తింపు కలిగిఉండాలి.కవర్ చేసిన కధనాలు వివాదాలకి తావులేని కథనాల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
పౌర జర్నలిజం.
జర్నలిస్ట్ గా అనుభవం లేకపోయినా జర్నలిజంపై ఆశక్తిగా పలు న్యూస్ యాప్స్,పలు ప్రాంతాల్లో జరిగిన సంఘటనలను ఆయా ప్రాంతాల పౌరులు వార్తల ను సేకరించి గుర్తింపు కలిగిన న్యూస్ యాప్స్ లో తమ పేరు మీదుగా ప్రచురణ/ప్రసారం కాబడిన క్లిప్స్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ఆర్ట్స్ జర్నలిజం
కార్టూన్స్,పెయింటింగ్,గ్రాఫిక్,కామిక్,ఇతర సాంస్కృతిక విభాగాలు వంటివి ఆధారంగా పనిచేసే వారు ఆర్ట్స్ జర్నలిజంలోకి వస్తారు.
పొలిటికల్ రిపోర్టింగ్
రాజకీయాలకు సంబంధించి పొలిటికల్ బీట్ రిపోర్టర్స్ ఎవరైనా గుర్తింపు కార్డుతో తాము కవర్ చేసిన రాజకీయ అంశాలు నాయకులకు అనుకూలంగా కాకుండా.., ప్రజలపక్షాన, ప్రజాసమస్య లను ప్రశ్నించి సమాధానం రాబట్టగలిగిన విషయాలకు ప్రాముఖ్యత ఉంది. ప్రధానంగా ఇటువంటి కంటెంట్ ఉన్నవారు ప్రచురణ/ప్రసారం అయిన మూడు క్లిప్స్ ని అప్లికేషన్ తో జతచేయవలసి ఉంటుంది.
పర్యావరణ పరిరక్షణ.
పర్యావరణం కాపాడే దిశగా వార్తలు/వార్తా కధనాలు ప్రచురణ/ప్రసార విభాగాల్లో ఆధారాలు కలిగిన జర్నలిస్టులు కనీసం మూడు,మూడు క్లిప్స్ జతచేస్తూ పేర్లు నమోదు చేసుకోగలరు.
టాబ్లాయిడ్ జర్నలిజం.
టాబ్లాయిడ్ జర్నలిజం అనగా న్యూస్ పేపర్ లో ఉండే ప్రచురణలలో వార్తలు, రాజకీయాలు, సంస్కృతి, ఫ్యాషన్, జీవనశైలి మరియు వినోదం వంటి వివిధ అంశాలపై విభిన్న కథనాలు కలిగి ఉంటుంది. ఉదాహరణకు ప్రధాన పత్రికలలో ఈనాడు-వసుంధర, సాక్షి-ఫ్యామిలీ, వార్త-చెలి ఇలా ప్రత్యేక కంటెంట్ కలిగి వాటికి చెందిన వార్తలు/ప్రత్యేక కధనాలు రాసే జర్నలిస్టులు ఈ విభాగంలో అప్లై చేసుకోగలరు.
ది బెస్ట్ ప్రెస్ క్లబ్.
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడూ జర్నలిస్టులకు అండగా నిలుస్తూ....ప్రెస్ క్లబ్ లో జర్నలిస్టులకు న్యూస్ అందించే విధంగా, వార్తలు పరంగా కనీస అవసరాలు కల్పిస్తూ ఏ విధమైన వివాదాలు లేకుండా రిజిస్ట్రేషన్ చేయించబడి, కమిటీ కలిగి ఉన్న ప్రెస్ క్లబ్ లకు ఈ విభాగంలో దరఖాస్తు చేయడానికి ఆయా ప్రెస్ క్లబ్ కమిటీ మెంబర్స్ లో ఒకరి పేరున అథారిటీ పర్సన్ గా ప్రత్యేకమైన లెటర్ జతపరచాలి.
జీవిత సాఫల్య పురస్కారం.
జీవిత సాఫల్య పురస్కారం.










