Telugu Journalistula Samkshema Sangham

తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో త్వరలో చేపట్టబోయే ఉత్తమ జర్నలిస్టుల పురస్కారాల ప్రధానోత్సవం కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని ఆహ్వానించడం కోసం ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారిని కలిసి ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మేడవరపు రంగనాయకులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గజ్జల శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు కొండల్‌గౌడ్, సహాయ కార్యదర్శులు శ్రీనివాస్, సత్యం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సుబ్బారావు గారు తదితరులు పాల్గొన్నారు.