యూనియన్ కర్తవ్యాలు-లక్ష్యాలు
- 'జర్నలిజం అంటే వృత్తి కాదు, సామాజిక బాధ్యత' అని భావిస్తుంది తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం. ఐక్యత - సంక్షేమం - భరోసా నినాదాలతో ఏర్పాటైన "తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం" ప్రధానంగా జర్నలిస్టుల భద్రత, మీడియా స్వేచ్ఛ కు, సంక్షేమానికి కృషి చేస్తుంది.
- 1) జర్నలిస్టుల వృత్తి నైపుణ్యాలను పెంచేందుకు శిక్షణ తరగతులు, మానసిక పునరుత్తేజానికి సైకాలజీ నిపుణులచే తరగతులు
- 2) నిత్యం సమాజసేవలో పరితపించే జర్నలిస్టుల కోసం ప్రమాద భీమా కల్పించడం, ఆరోగ్య భీమా కు ప్రయత్నం
- 3) జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి 'జర్నలిస్ట్ కార్పొరేషన్' ని ఏర్పాటు చేపించడం
- 4) స్థిరమైన అభివృద్ధి, అందరికీ సంక్షేమం, మానవ హక్కుల పరిరక్షణ మరియు ప్రజాస్వామ్య ఏకీకరణకు ప్రాథమికమైనది జర్నలిజం. కానీ గత కొన్నేళ్లుగా చాలా తరచుగా ప్రమాదకరవృత్తిగా మిగిలిపోవడం విచారకరం. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం 'మీడియా కమిషన్ ' ఏర్పాటు చేసి, తద్వారా స్వేచ్ఛాయుత జర్నలిజానికి కృషి చేయడం. అలాగే మహిళా జర్నలిస్టులు వృత్తి పరంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించడం.
- 5) ప్రతి నియోజకవర్గంలో జర్నలిస్టు సంఘాలకు సంబంధం లేకుండా రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ కేంద్రాలలో ' ప్రెస్ క్లబ్ ' లు ఏర్పాటుకు ప్రయత్నం
- 6) వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేటు విద్యా సంస్థలలో ఉచితంగా లేదా కనీసం 50శాతం ఫీజు రాయితీ మంజూరు చేయాలని ప్రభుత్వంచే జీవో రూపొందించి, పక్కాగా అమలు చేపించడం. మరియు విద్యార్థులకు ప్రత్యేక అవగాహన సదస్సులు
- 7) వెటరన్ /సీనియర్ జర్నలస్టులకు పెంక్షన్ సదుపాయం కల్పించడం
- 8) ఎన్నో ఏళ్ళుగా జర్నలిజంలో కొనసాగుతూ నేటి వరకు సొంత గృహాలు లేక అద్దె గృహాలలో,చాలీ చాలని ఇరుకు గృహాలలో జీవితాలు నెట్టుకొస్తున్న జర్నలిస్టులకు సొంతింటి కల నెరవేర్చేందుకు కృషి
- 9) వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ప్రభుత్వ గుర్తింపు కార్డు (అక్రిడేషన్) పొందేలా కృషి.
- 10) తప్పనిసరిగా వర్కింగ్ జర్నలిస్టులకు ఆయా మీడియా సంస్థలు/ యాజమాన్యాలు నెలవారీ గౌరవవేతనం ఇవ్వాలి. మీడియా సంస్థలు కార్మిక చట్టాలు, వేతన చట్టాలు ఖచ్చితంగా అమలు చేసేలా ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేయాలి.
- 11) సంఘం తరఫున 'జర్నలిస్టుల సంక్షేమ నిధి' ఏర్పాటు చేయడం. తద్వారా జర్నలిస్టులకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం. వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు చర్యలు.
- 12) అత్యవసర పరిస్థితుల్లో వైద్య ఖర్చులకు తక్షణ సాయం
- 13) అకాల మరణం సంభవిస్తే మట్టి ఖర్చులకోసం రూ.10వేలు ఆర్థికసాయం
- 14) కోవిడ్ తో చనిపోయిన జర్నలిస్టులకు ఐదు లక్షల సహాయం అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం.
- 15) అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చల ద్వారా స్థానిక జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు
- 16) జర్నలిస్టులపై భౌతిక దాడులు, తప్పుడు కేసులపై సంఘం తరపున సహకారం.
- 17) వృత్తిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన జర్నలిస్టులను ప్రోత్సహించేలా ప్రతీ ఏటా "ఉగాదికి నగదు తో కూడిన పురస్కారాలు " సంఘం తరఫున అందజేత. మరియు రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో ప్రతీ ఏటా పురస్కారాలు అందించేలా ఒప్పించడం.
- 18) జర్నలిస్టుల కోసం ఇతర సంఘాలతో కలిసి వివిధ అంశాలపై చర్చించడానికి, ఐక్య పోరాటాలకు సిద్దం.
- పై కార్యక్రమాల ద్వారా మెరుగైన సమాజానికి ఉత్తమ సేవలు అందించే నిజమైన జర్నలిస్టులు ధైర్యంగా జీవిస్తారని, ఒక భరోసా కలిగి ఉంటారని, తద్వారా ' ఫోర్త్ ఎస్టేట్ ' గా పిలువబడే జర్నలిజం పూర్వవైభవం పొందుతుందని..' ఐక్యత - సంక్షేమం - భరోసా' నినాదాలతో ఏర్పాటైన మా "తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం" భావిస్తుంది.
