పురస్కారాలు - అర్హతలు.
జర్నలిస్ట్ సామాజిక స్పృహ, బాధ్యత, భద్రత.
ఈ మూడు అంశాలను పరిగణలో ఉంచుకుని జర్నలిస్ట్ గా సామాజిక స్పృహతో తీసిన ఫొటో, జర్నలిస్ట్ గా రాసిన కథనం ప్రచురణ/ప్రసారం ఆధారాలు అందిస్తూ... బాధితులకు భద్రత కల్పించిన వివరాలు జతపరచండి.
అగ్రికల్చర్ జర్నలిజం.
ఆగ్రికల్చర్ జర్నలిజం విభాగంలో రైతుల సమ స్యలు, పంటనష్టాలు వంటి ఏ కథనాలు అయినా... ఏ మీడియాకు వెన్నుదన్ను గా ఉండి అగ్రి జర్నలిజంలో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్నారో... తగిన ఆధారాలు జతపరచండి.
వెనుకబడిన ప్రాంతాలలో "విద్యా-వైద్యం" *సౌకర్యాలు.
జర్నలిస్టుగా మీరు పనిచేస్తున్న ప్రాంతంలో ఉచిత విద్య-వైద్యం కోసం మీరు రాసిన కథనాలు, ఆయా కథనాల ద్వారా స్థానికులు ఎవరైనా లబ్ధి పొంది ఉంటే దానికి సంబంధించిన జర్నలిస్టుల యొక్క కథనాలు, లబ్ధి పొందిన వారి వివరాలు జతపరచండి
ప్రత్యేక జర్నలిస్ట్ గా గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ పరిధిలో రాయలసీమ, ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, పల్నాడు, రాజధాని అమరావతి ప్రాంతాలలో బహుముఖ ప్రజ్ఞాశాలులుగా ప్రత్యేక గుర్తింపు కలిగిన జర్నలిస్టులు.అందుకు తగిన ఆధారాలు జతపరచండి.
క్రైమ్ జర్నలిజం
క్రైమ్ జర్నలిజంలో ప్రత్యేక కథనాలు, న్యూస్ కవరేజ్ లో ఎదుర్కొన్న ఇబ్బందులు ఇతర ఆధారాలు జతపరచండి.
ఫొటో/వీడియో జర్నలిస్ట్ లు
ఫోటో/వీడియో జర్నలిస్టులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటో/వీడియో జర్నలిస్ట్ లుగా మీరు తీసిన ఫొటోలు/వీడియోలు ప్రత్యేక గుర్తింపు సాధించి ఉంటే... ఆధారాలు జతపరచండి.
సినిమా జర్నలిజం.
సినిమా జర్నలిస్టులుగా ప్రత్యేక గుర్తింపు సాధించిన సినిమా పత్రికలు/ఛానల్స్ జర్నలిస్ట్ లుగా మీ ప్రత్యేకతలు జతపరచండి.
స్ట్రింగర్స్/గ్రామీణ విలేకరులు
స్ట్రింగర్స్-గ్రామీణ విలేకరులు జర్నలిజంలో వార్తల సేకరణ విషయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు ఆధారాలతో సహా ఒక కథనంలా రాసి ఆ కథనాలకు మీ వద్ద ఆధారాలు ఉంటే... జతపరచండి.
చిన్న పత్రికల ప్రోత్సాహం.
చిన్న చిన్న దినపత్రిక లు నుంచి మాసపత్రికల వరకు పత్రికలు అన్నీ ఒకే విభాగంగా సామాజిక అంశాలతో పాఠకులను/ప్రజలను పలు అంశాలపై చైతన్య పరిచే కథనాలు మీ పత్రికలలో ప్రచురించబడి ఉంటే అప్లికేషన్ తో జతపరచండి.
వెటరన్ జర్నలిస్ట్
55 సంవత్సరాలు నిండి వెటరన్ జర్నలిస్టుగా ప్రత్యేక అర్హత కలిగి ఇప్పటికి వార్తా కథనాలు రాస్తూ... ఉంటే వాటి ఆధారాలు జతపరచండి.
సీనియర్ వీడియో జర్నలిస్టు
రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ మీడియా విభాగం నుంచి 45-50 సంవత్సరాలు కలిగిన లేదా ఆపైన సంవత్సరాలు కలిగిన వీడియో జర్నలిస్ట్ ఆధారాలు జతపరచండి
న్యూస్ కవరేజీలో అంగవైకల్యం ఏర్పడిన జర్నలిస్ట్.
న్యూస్ కవరేజీలో భాగంగా ప్రమాదకరమైన అసైన్ మెంట్స్ కి వెళ్లి ప్రమాదానికి గురై అంగ వైకల్యం ఏర్పడిన జర్నలిస్టులు ఎవరైనా ఉంటే ఆధారాలతో జతపరచండి.
జంతు సంరక్షణ- బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు జర్నలిస్ట్ గా...
వెనుకబడిన ప్రాంతాల్లో/అటవీ ప్రాంతా లకు దగ్గరగా ఉన్న జర్నలిస్ట్ లు జంతు సంరక్షణ/బాలకార్మిక/బాల్య వివాహ ఘటనలు పై రాసిన కథనాలు లేదా మీరు రాసిన కథనాల వల్ల కనీస మార్పులు కలిగితే వాటికి చెందిన ఆధారాలు జతపరచండి.
అనారోగ్యంతో బతుకు భారమైన జర్నలిస్ట్.
అనారోగ్యంతో ఇప్పటికీ జర్నలిజంలో కొనసాగు తూ... జర్నలిజంలో బతకలేక మరే పని చేయలేక ఇబ్బందులు ఎదుర్కొం టున్న జర్నలిస్ట్ లు ఆధారాలు జతపరచండి.
మహిళా జర్నలిస్టు గా ప్రత్యేక గుర్తింపు...
జర్నలిజంలో మహిళ లు రావడం అంటేనే... ఎంతో ప్రత్యేకం. అటు వంటిది మహిళా జర్నలిస్ట్ ని ప్రత్యేకంగా గుర్తిస్తూ వారు జర్నలిజంలో ఏ విభాగంలో పనిచేస్తున్నా... వారిని ప్రోత్సహిస్తూ... వారు పనిచేస్తున్న ప్రత్యేక విభాగంలో గుర్తింపు పొందారనడానికి తగిన ఆధారాలు జతపరచండి.
పరిశోధనా కథనాలలో ప్రతిభ
జర్నలిజంలో ఇన్వెస్టిగేషన్ (పరిశోధన) కథనాలది ప్రత్యేక స్థానం అనేది తెలిసిందే... సదరు పరిశోధన కథనాల వల్ల సమాజానికి జరిగిన ప్రయోజనం వెలకట్టలేనిది. అటువంటి ప్రయోజనం పొందిన ఉత్తమోత్తమైన పరిశోధన కథనాలతో పాటు స్పందనగా ఇచ్చిన క్లిప్పింగులు కూడా ఉంటే జతపరచండి.
మారుతున్న కాలానికి అనుగుణంగా, టెక్నాలజీ పరంగా గుర్తింపు కలిగిన జర్నలిస్ట్ లు
మారుతున్న కాలానికి అనుగుణంగా, టెక్నాలజీ పరంగా గుర్తింపు కలిగిన జర్నలిస్ట్ లు నడుపుతున్న తెలుగు న్యూస్ వెబ్సైట్ లలో ఒక వెబ్సైట్ కి అవకాశం.దీనికి అర్హతగా వెబ్సైట్ కి ఉన్న ఎక్కువ వీక్షకుల సంఖ్యను పరిగణలోకి తీసుకోడం జరుగుతుంది. కాబట్టి ఆ వివరాలను జతపరచండి.
గతంలో జర్నలిస్ట్ లు గా పనిచేసి ప్రస్తుతం సొంతగా యూ ట్యూబ్ ఛానల్
గతంలో జర్నలిస్ట్ లు గా పనిచేసి ప్రస్తుతం సొంతగా యూ ట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న సీనియర్ జర్నలిస్ట్ లకు అవకాశం. దీనికి అర్హతగా మీరు నడుపుతున్న యూ ట్యూబ్ ఛానల్ సబ్ స్క్రైబర్స్ సంఖ్యను, వీక్షకులను పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఆ వివరాలను జతపరచండి.
